
హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడుతోంది. 2024, జూన్ 8వ తేదీ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు కురుస్తోంది. సిటీలో ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి చిరుజల్లులతో వర్షం మొదలైంది. అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర నగర వాసులను హెచ్చరించింది.
సాయంత్రం హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈదురుగాలులు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నట్లు చెప్పింది. భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.