
హైదరాబాద్ లో యువకుడు మూసీ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే ఛాదర్ ఘాట్ బ్రిడ్జి వద్దకు వచ్చిన ఓ యువకుడు.. బైక్ ను ఫుట్ పాత్ పై పార్క్ చేసి అమాంతం నీళ్లలోకి దూకేశాడు. అక్కడ ఉన్న కొందరు గమనించి కేకలు వేస్తు అక్కడికి చేరుకునే లోపే కొట్టుకుపోయాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు తన బైక్ ను బ్రిడ్జి పై వదిలేసి నేరుగా వరద ప్రవాహంలోకి దూకినట్లు చెబుతున్నారు. దూకిన క్షణాల్లోనే అతడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.
వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆత్మహత్యా ప్రయత్నమా..? లేక వేరే కారణమా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బైక్ నంబర్ ఆధారంగా.. కిరణ్ గౌడ్ అని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..!