తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణశాఖ అధికారులు. దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఎల్లుండి వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

ఆగ్నేయ దక్షిణ దిశల నుండి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఉత్తరభారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా అదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల,నిర్మల్ జిల్లాలలో జనవరి 10, 11న వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎముకలు కొరికే చలిలో జవాన్ల గస్తీ