- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ/వేములవాడరూరల్/చందుర్తి, వెలుగు: మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు రాజన్నసిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. రుద్రంగి, వేములవాడ అర్బన్ మండలాల్లో గురువారం ఓటింగ్ సరళి, లెక్కింపును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ 79.57 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. ఆమె వెంట వేములవాడ ఆర్డీవో రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

