
రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు బీజేపీ 68 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 60 సీట్లతో వెనుకంజలో ఉంది. గత టర్మ్‌లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77 శాతం ఓట్లు పోలు కాగా.. కాంగ్రెస్‌కు 39.30 శాతం ఓట్లు వచ్చాయి.
రాజస్థాన్ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 40 మంది రెబల్స్ పోటీ చేశారు. ఈ క్రమంలో రిలీజైన ఎగ్జిట్ పోల్స్.. బీజేపీకి ఎడ్జ్ అని అంచనా వేయగా, మూడు ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.