రాఖీ గిఫ్టుల్లో చాక్లెట్స్ బొకేల హవా

 రాఖీ గిఫ్టుల్లో చాక్లెట్స్ బొకేల హవా

చాక్లెట్స్ అంటే అందరికీ వింటేనే నోరూరిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా... ప్రతి ఒక్కరికీ చాక్లెట్స్ అంటే ఇష్టమే. అందుకే హైదరాబాద్ లో గల్లీకో చాక్లెట్ రూమ్ వెలుస్తోంది. ఆత్మీయులకి ఇచ్చే గిఫ్టుల్లో కూడా చాక్లెట్స్ బొకేల హవా నడుస్తోంది. అకేషన్ బట్టి... చాక్లెట్ హాంపర్స్, గిఫ్ట్ ప్యాక్స్, చాక్లెట్ బొకేస్ ని తయారు చేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం రాఖీ ఫెస్టివల్ కోసం అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి చాక్లెట్స్.. 

యమ్మీ.. చాక్లెట్స్ చూస్తే ఎవరికైనా మనసు లాగేస్తుంది. ఇక తింటే.. మైమరిచిపోవాల్సిందే. టేస్ట్ లోనే కాదు చూడటానికి కూడా అందంగా కనిపిస్తున్నాయి. అందుకే  హైదరాబాద్ లో చాక్లెట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా ఎక్కడైనా చాక్లెట్ హట్ ప్రారంభిస్తే చాలు... వాటిని రుచి చూడనిదే మనసాగదు చాక్లెట్ ప్రియులకు. పిల్లలే కాదు... యూత్, పెద్దలు కూడా టేస్ట్ చూసేందుకు పోటీపడుతున్నారు

ప్రస్తుత రోజుల్లో  గిఫ్టులు ఇవ్వడానికి ఎన్నో ఐటెమ్స్ ఉన్నాయి. వాటిల్లో అన్నాచెల్లెల బంధానికి గుర్తుగా నిలిచే రాఖీ పండక్కి సిటీలోని స్వీట్ షాప్స్ లో సందడి కనిపిస్తోంది. వీటిల్లో కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తో పాటు చాక్లెట్ హాంపర్స్ కు క్రేజ్ పెరిగింది.  స్వీట్స్ , చాక్లెట్స్ తో అకేషన్ జరుపుకోవడం కామన్. అయితే ప్లెయిన్ చాక్లెట్స్ బోర్ గా ఫీలయ్యేవారు.. డిఫరెంట్ గా పోట్రేట్ చాక్లెట్స్ తో పాటు...కోట్స్ చాక్లెట్స్,బొకే చాక్లెట్స్ గిప్టుగా ఇస్తున్నారు. ప్రస్తుతం రాఖీ పండగ కోసం బ్రదర్ అండ్ సిస్టర్ చాక్లెట్ హాంపర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో దూరంగా ఉన్న అన్నదమ్ములకు రాఖీలతో పాటు... చాక్లెట్ హాంపర్స్ ను గిఫ్ట్ గా పంపుతున్నారు..

వాలెంటైన్స్ డే, బర్త్ డే పార్టీల్లోనూ చాక్లెట్స్ నే గిఫ్ట్ గా ఇస్తున్నారు. చాక్లెట్స్ ను బొకేస్ గా డిజైన్ చేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు వ్యాపారులు. చాక్లెట్స్ తో డిఫరెంట్ గా బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు.  డాల్స్,  కార్స్ లాగా వివిధ రకాల డిజైన్స్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ తో కాస్టుకు తగ్గట్టు  హ్యాంపర్స్ తయారు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ స్వీట్స్ లోనే వందల రకాల వెరైటీలను చూసిన నగరవాసులు.... చాక్లెట్లలో కూడా వెరైటీలు రావడంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం రాఖీ ఫెస్టివల్స్ స్పెషల్ గిఫ్ట్స్, చాక్లెట్ హాంపర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సిటీ ప్రజల అభిరుచిలో ఎన్ని మార్పులు వచ్చినా చాకెట్ల సేల్స్ కు రెస్పాన్స్ బాగుందని.. కొత్తరకం మార్కెట్లోకి వస్తే చాలు వెంటనే టేస్టు చూసేందుకు ఎగబడే వారి సంఖ్య బాగా పెరిగిందని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.