RGV: చరణ్లో ఓ విస్ఫోటనం చూశానంటూ ఆర్జీవీ ట్వీట్.. ఏంటి గురూ మీలో ఇంత మార్పు అంటున్న నెటిజన్లు!

RGV: చరణ్లో ఓ విస్ఫోటనం చూశానంటూ ఆర్జీవీ ట్వీట్.. ఏంటి గురూ మీలో ఇంత మార్పు అంటున్న నెటిజన్లు!

ఆర్జీవీ (Ram Gopal Varma).. ఇతని శైలి అందరికీ భిన్నం. వెండితెరపై విలక్షణ దర్శకుడిగా పేరుంటే, మాట్లాడేటపుడు సంచలన దర్శకుడుగా మారిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే, ఆర్జీవీ ఒక వింతజీవి. ఎప్పుడు ఎవ్వరికీ అర్థం కాడు. ఏ క్షణంలో ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడటం.. అనుకున్నది చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. ఇపుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. గతంలో మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపిన ఆర్జీవీ.. ఇపుడు తన కొత్త పోస్టులతో మెగా ఫ్యామిలీ హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘‘నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు’’ అని చిరంజీవిని ఉద్దేశించి వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇపుడు మరొక కొత్త పోస్టుతో మెగా ఫ్యాన్స్ని తనవైపు లాగేసుకున్నారు. 

లేటెస్ట్గా (2025 నవంబర్ 11న) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై డైరెక్టర్ ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. ‘పెద్ది’ ఫస్ట్ లిరికల్ వీడియోని ఉద్దేశిస్తూ.. చాలాకాలం తర్వాత మళ్లీ చరణ్లో హై ఓల్టేజీని చూశానని X వేదికగా పోస్టు పెట్టారు. 

‘‘ సినిమా రంగంలోని ప్రతి కళ.. అంటే, ‘డైరెక్షన్‌, మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ తదితర విభాగాల’ ముఖ్య ఉద్దేశం.. హీరోని గొప్పగా చూపించడమే. అలా హీరోని ఎలివేట్‌ చేయడమే ఈ విభాగాల మెయిన్ టార్గెట్. చాలా కాలం తర్వాత ‘పెద్ది’ లోని ‘చికిరి చికిరి’ పాటతో చరణ్లో ఓ విస్ఫోటనం చూశాను. ఈ పాటలో రామ్‌చరణ్‌ రా లుక్‌లో ఎనర్జిటిక్‌గా కనిపించాడు.

వందలాది డ్యాన్సర్లు, భారీ సెట్లు.. ఇలా అనవసరమైన వాటిపై కాకుండా హీరో పైనే ప్రేక్షకుల దృష్టిపడేలా డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ప్రయత్నం బాగుంది. ఒక స్టార్‌ తన చుట్టూ మెరుపులు ఉన్నప్పుడు కాదు.. సహజంగానే ఎక్కువగా ప్రకాశిస్తాడన్న విషయాన్ని అర్థం చేసుకున్నారంటూ బుచ్చిబాబు మేకింగ్ని మెచ్చుకున్నారు. వందలాది డ్యాన్సర్లలో చరణ్ ఒక మచ్చలా కాకుండా.. ఒక స్టార్లా చూపించి సక్సెస్ అయ్యారు. కుదోస్ బుచ్చిబాబు అని ప్రశంసించారు’’ అని ఆర్జీవీ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతూ.. ఆర్జీవీ ట్వీట్స్కు లైక్స్ కొడుతూ, షేర్ చేస్తున్నారు. ‘సడెన్‌గా ఎందుకు ఇంత ప్రేమ?’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘ఏంటి గురూ మీలో ఇంత మార్పు.. అవసరానికా లేకా నిజంగా మారేరా’ అని ట్వీట్స్ పెడుతున్నారు.

ఏదేమైనా ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అని మెగా ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారు.  ఇకపోతే, ప్రస్తుతం చికిరి వీడియో సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్న పాటగా ‘చికిరి’ రికార్డు నెలకొల్పింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆర్జీవీ తన కొత్త సినిమా పనిలో బిజీలో ఉన్నారు. ‘పోలీస్‌‌ స్టేషన్‌‌ మే భూత్‌‌’ పేరుతో ఆర్జీవీ తనకు అచ్చొచ్చిన హారర్ థ్రిల్లర్ జోనర్లో మూవీ తెరకెక్కిస్తున్నారు. అంటే 'పోలీస్ స్టేషన్‌లో దెయ్యం' అని అర్ధం. ఇలా టైటిల్కి తగ్గట్టుగానే ‘యూ కాంట్‌‌ అరెస్ట్‌‌ ది డెడ్‌‌’ అనే క్యాప్షన్‌‌ తో ఆర్జీవీ తన మార్క్ చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇందులో బాలీవుడ్‌‌లో పవర్‌‌‌‌హౌస్ ఫెర్ఫార్మర్‌‌‌‌గా పేరుగాంచిన మనోజ్ బాజ్‌‌పాయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. జెనీలియా, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తోన్నారు.

ఓ భయంకరమైన గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ను.. పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎన్‌‌కౌంటర్‌‌‌‌ చేయగా, రివేంజ్‌‌ తీర్చుకోవడానికి అతను దెయ్యంలా తిరిగొస్తే ఏం జరిగింది అనేది ఈ సినిమా మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌ అని వర్మ ప్రకటించారు. అంటే, సాధారణంగా.. మనం భయపడినప్పుడు పోలీసుల వద్దకి వెళ్తాం. మరి పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ ఈ కథ ఉంటుందని ఆర్జీవీ తెలిపారు.