రాజ్యసభలో జేడీయూ ఎంపీ రామ్​నాథ్​కు కేంద్రమంత్రి

రాజ్యసభలో జేడీయూ ఎంపీ రామ్​నాథ్​కు కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: బీహార్ నుంచి జేడీయూ తరఫున రెండోసారి రాజ్యసభ ఎంపీగా సేవలందిస్తున్న రామ్​నాథ్ ఠాకూర్​కు కేంద్ర మంత్రి పదవి వరించింది. కొన్ని నెలల కిందే రామ్ నాథ్ ఠాకూర్ తండ్రి దివంగత కర్పూరి ఠాకూర్​కు ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ప్రకటించింది. నాయీ కమ్యూటీకి చెందిన 73 ఏండ్ల రామ్ నాథ్ ఠాకూర్.. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్లు 1.57 శాతం మంది ఉన్నారు. నాయీ కమ్యూనిటీ ఈబీసీ కేటగిరి కిందికి వస్తుంది. రాష్ట్రంలో వీరి జనాభా 36.01 శాతం ఉంది. కర్పూరి ఠాకూర్​కు భారతరత్న అనౌన్స్ చేశాక.. ఆయన ఫ్యామిలీతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జేడీయూ నుంచి మొత్తం ఆరుగురికి మంత్రి పదవులు దక్కాయి.