
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మెయిన్ రోల్స్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘రానా నాయుడు’.ఇపుడీ ఈ సక్సెస్ ఫుల్ సీజన్కు కొనసాగింపుగా సీజన్2 రెడీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ సందర్భంగా లేటెస్ట్గా (JUNE3న) ‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తి్స్తోన్న ఈ సీజన్ 2 ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. తొలి సీజన్ బోల్డ్ కంటెంట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొంది. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోతో బోల్డ్ డైలాగ్స్ పలికించడంతో మరింత వైరల్ అయ్యింది.
ఈ సారి అన్నీ జాగ్రత్తలు తీసుకునే సీజన్ 2 తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ కట్‌లో బోల్డ్ సీన్స్ లేవు. మొత్తం యాక్షన్ డ్రామాగా రానున్నట్టు ట్రైలర్ కట్ చేశారు. నాగా నాయుడి పాత్రలో వెంకటేష్ చాలా అద్భుతంగా మెప్పించాడు. తన ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా వెళ్లే పవర్‌ఫుల్ వ్యక్తిగా ఆయన ఇందులో కనిపించనున్నారు. సీజన్ 2 మొత్తానికి కామెడీ, క్రైమ్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ట్రైలర్ రిలీజై అంచనాలు పెంచింది. జూన్ 13న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
రానా నాయుడు సీరీస్1 విషయానికి వస్తే..
ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించిన 'రానా నాయుడు' సిరీస్.. 2023 మార్చి10న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సిరీస్ విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా.. నంబర్.1 స్థానంగా నిలిచి ట్రెండ్ స-ృష్టించింది. వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకెళ్లింది. విడుదలైన రెండు వారాల పాటు నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కోసం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో 'రానా నాయుడు' ట్రెండ్ అయ్యి.. సెకండ్ సీజన్ పై ఆసక్తి పెంచింది.
సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ 'రానా నాయుడు' సిరీస్‌ను.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ రూపొందించారు, సహ-దర్శకత్వం కూడా వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.