- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రావుల కృష్ణ, మాచెర్ల రాంబాబు
హైదరాబాద్, వెలుగు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రావుల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మాచెర్ల రాంబాబు ఎన్నికయ్యారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌లో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర కొత్త కమిటీని ఎన్నుకున్నారు. రావుల కృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యావిభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, మాచెర్ల రాంబాబు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్నారు. ఈ సభలకు చీఫ్ గెస్టుగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ తదితరులు హాజరై మాట్లాడారు.
