బీభత్సంగా తాగారు : 30 రోజుల లిక్కర్ సేల్స్ రూ.4 వేల 274 కోట్లు

బీభత్సంగా తాగారు : 30 రోజుల లిక్కర్ సేల్స్ రూ.4 వేల 274 కోట్లు

తాగురా.. తాగి ఊగరా.. మత్తురా.. గమ్మత్తురా అనే పాటలు పాడుతున్నారు తెలంగాణ జనం. మద్యం తాగటంలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ నెల రికార్డును.. 2023 డిసెంబర్ నెల తిరగరాసింది. ఏకంగా అమ్మకాలు 26 శాతం పెరిగాయి. ఇందులో హార్డ్ అంటే విస్కీ, బ్రాందీ, చీప్ లిక్కర్ వంటివి 33 శాతం అమ్మకాలు పెరగగా.. బీర్లు మాత్రం 16 శాతం పెరిగాయి. ఇదంతా గత డిసెంబర్.. ఈ డిసెంబర్ మధ్య తేడానే.. 

ఇక మద్యం అమ్మకాల విలువను పరిశీలిస్తే.. 2023 డిసెంబర్ నెల 31 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 274 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబర్ 29వ తేదీ 180 కోట్లు.. డిసెంబర్ 30వ తేదీ 313 కోట్లు.. డిసెంబర్ 31వ తేదీ 127 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. మూడు రోజుల్లో 620 కోట్ల రూపాయల మందు తాగారు జనం.

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సరికొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు జనాలు. తెల్లవార్లూ వేడుకలు జరుపుకుంటూ.. కేక్ కట్ చేసి.. శుభాకాంక్షలు తెలుపుకుని.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం అమ్మకాలు.. ప్రతి ఏటా పెరుగుతున్నాయి . తప్ప తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది కూడా తెలంగాణలో మందు బాబులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోళ్లు చేశారు. ఒక్క రోజులోనే ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయల ఆదాయం అందజేశారు. 2023  డిసెంబర్ 31 నాడు అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచిందేకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

 కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. తమ జేబులు గుల్లచేసుకుని ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో రూ.620 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌ కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు తెరిచి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. 

డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో అనగా డిసెంబర్‌ 29న రూ.180 కోట్లు, 30న రూ.313 కోట్లు, 31న అత్యధికంగా రూ.127 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,000 కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి.ఒక్క డిసెంబర్ నెలలోనే 4 వేల 274 కోట్ల రూపాయిల  మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ఓవరాల్ గా 26 శాతం మేరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇక లిక్కర్ (హార్డ్): 33 % మేర సేల్ పెరుగగా..బీరు:16%  పెరిగింది.

మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడు పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం,కూల్ డ్రింక్స్ తో పాటు....చికెన్,మటన్,చేపలు కూడా భారీగా అమ్ముడుపోయాయి.హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సందర్భంగా నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో నాన్ వెజ్ విక్రయాలు మరింత పెరిగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగితే ఆదివారం ఒక్క రోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి.