
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టామని రెడ్ క్రాస్ యూనిట్ మెంబర్లు గవర్నర్ తమిళిసైకి తెలిపారు. గురువారం రాజ్ భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా యూనిట్ ప్రతినిధులు గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా వరంగల్లో బాధితులకు చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్కు వివరించారు. సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. యూనిట్ నిర్వాహకులను అభినందించారు. బ్లడ్ బ్యాంక్, జనరిక్ మెడిసిన్స్ షాప్, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, సీపీఆర్, ఫిజియోథెరపీ యూనిట్లను స్టార్ట్ చేయాలని వారిని గవర్నర్ కోరారు.