వారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్

వారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్
  • మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్ 

మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రాస్తారోకో చేశారు. తమ తండాలకు ఆరు కిలోమీటర్ల వరకు రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రోడ్డు వెయ్యకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని సర్పంచ్ రంగీలా హెచ్చరించారు. మట్టి రోడ్డుపై వర్షాలకాలంలో బయటకు వెళ్లాలంటే బురద వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాకాలంలో బురద సమస్య ఉంటే.. మిగిలిన రోజుల్లో గుంతల వల్ల వాహనాలు వెళ్లేందుకు వీలులేని పరిస్థితి ఉందని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము తండాలవాసులమనే చిన్నచూపుతో తమగోడు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంజూరైన రోడ్డును కూడా వేరే పంచాయతీలకు మళ్లించారని ఆరోపించారు. వారం రోజుల్లో మాకు బీటీ రోడ్డు.. లేదంటే సిమెంట్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.

 

https://www.youtube.com/watch?v=iyAGAMBHBJc