ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ 

ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ 

అమరావతి: ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్థులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో ఏర్పాట్లు చేశామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్ కోసం విద్యార్థులు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని, అలాగే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

వెబ్ సైట్ bie.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే తీర్చేందుకు ప్రతి కాలేజీలో.. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఫోన్ చేసి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్: 18002749868 కు కాల్ చేయొచ్చు. దరఖాస్తు చేసేందుకు ఫీజు ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీ,పీహెచ్ లకు రూ.50గా నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్ కోసం చేసిన దరఖాస్తులను నెలాఖరు వరకు పరిశీలన చేసి అడ్మిషన్ లెటర్లను పంపడం జరుగుతుందని ఇంటర్ బోర్డు తెలియజేసింది.