ఎమ్మెల్యే కాకముందు నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో..

V6 Velugu Posted on Sep 20, 2021

  • కేటీఆర్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ 

హైదరాబాద్: జడ్పీటీసీ నుంచి ఈ స్థాయికి వచ్చిన మా నాయకుడిని నీ స్థాయి కాదు అంటే... నువు ఎమ్మెల్యే కాకముందు నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో కేటీఆర్ అని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ సూచించారు. మీ అయ్యా ముఖ్యమంత్రి కాకముందు నీ స్థాయి ఏంటో ముందు నువు గుర్తు చేసుకో కేటీఆర్ అని ఆయన అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు దమ్ముంటే నువు అమర వీరుల స్థూపం వద్ద కు రా... అని సవాల్ చేశారు. నీకు ఈరోజు వీలుకాకపోతె రేపు రా.. మా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 
వైట్ ఛాలెంజ్ స్వీకరించకుండా దావా అంటూ కొత్త డ్రామాలు
తెలంగాణ రాష్ట్రం ను డ్రగ్ రహిత రాష్ట్రం గా మార్చేందుకు  మా నాయకులు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను విసిరితే దాన్ని స్వీకరించకుండా పరువు నష్టం దావా అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని అద్దంకి దయాకర్ విమర్శించారు. మా భాష గురించి మాట్లాడుతున్న టీఆరెఎస్ మంత్రులు నాయకులు ముందు మీరు మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై మాట్లాడిన భాష ఎలా ఉందో  ఒక్కసారి చూస్కోండి అని ఆయన సూచించారు. ‘‘కేటీఆర్ మీరు మమ్మల్ని ద్వేషించినా మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం.. వైట్ ఛాలెంజ్ కొనగుతూనే ఉంటుంది..’’ అని అద్దంకి దయాకర్ అన్నారు.  మా యూత్ కాంగ్రెస్ నాయకులు అందరం ఈ  వైట్ ఛాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలి.. రాష్టాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రం గా మార్చేందుకు పని చేయాలని అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. 
 

Tagged Congress party, gandhi bhavan, addanki dayakar, telangana congress, t congress, , congress leader addanki dayakar comments, addanki dayakar updates

Latest Videos

Subscribe Now

More News