వరంగల్ సభలో కేసీఆర్ నా పేరెత్తే ధైర్యం చేయలేదు: రేవంత్ రెడ్డి

వరంగల్ సభలో కేసీఆర్ నా పేరెత్తే ధైర్యం చేయలేదు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  సభకు  ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వాలని చెప్పానన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని చెప్పారు. సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ విషం కక్కారే తప్ప..ప్రజాసమస్యలను ఎక్కడా ప్రస్తావించ లేదన్నారు. కేసీఆర్ కళ్లల్లో..మాటల్లో అనువణువు విషం కనిపించిందన్నారు.    కేసీఆర్  ఒక్క ప్రజా సమస్యను అయినా ప్రస్తావించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా వరంగల్ సభలో ఎక్కడా కూడా తన పేరు ఎత్తే ధైర్యం చేయలేదన్నారు రేవంత్. కాంగ్రెస్ కార్యకర్తల ధైర్యం ఏంటో తెలుసన్నారు రేవంత్. 

వరంగల్ సభతో చేసిన పాపాలు పోతాయని కేసీఆర్ అనుకున్నాడు కానీ..కేసీఆర్ ఇంకో  పాపం చేశారని ఫైర్ అయ్యారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని విలన్ అని కొత్త తప్పు చేశారన్నారు. కాంగ్రెస్ ఎందుకు విలన్ అయితది కేసీఆర్..తెలంగాణ ఇచ్చినందుకు విలనా.? పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని ఇపుడు విలన్ అంటారా అని మండిపడ్డారు రేవంత్. 

►ALSO READ | కేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి