RRB Group D Recruitment 2026: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 22వేల RRB గ్రూప్ D పోస్టుల దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. మొదట్లో దరఖాస్తుల ప్రక్రియ జనవరి 21న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడు జనవరి 31కి వాయిదా పడింది. దింతో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కొత్తగా సవరించిన షెడ్యూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 31 నుండి మొదలై మార్చి 2 రాత్రి 11:59 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrb.gov.inని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB గ్రూప్ D ఖాళీలు :
ప్రతిపాదన ప్రకారం, తూర్పు మధ్య రైల్వేకు 993 పోస్టులు, సౌత్ ఈస్టర్న్ రైల్వేకు 1,199 పోస్టులు కేటాయించారు. ఈ గ్రూప్ డి నియామకంలో అత్యధిక ఖాళీలు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి, మొత్తం 12వేల500 పోస్టులు ఆమోదించింది. వీటిలో, అత్యధికంగా 11వేల పోస్టులు ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-4కి సంబంధించినవి. ట్రాఫిక్ పాయింట్ బిలో 5వేల ఖాళీలు ఉండగా, అసిస్టెంట్ (ఎస్ అండ్ టి)లో 1,500 ఖాళీలు ఉన్నాయి.
ఆధార్ కార్డు, ఫోటో అవసరం:
దరఖాస్తు ప్రక్రియకి ముందు అభ్యర్థులు ఆధార్ కార్డు వివరాలు, ఫోటోను అప్‌డేట్ చేయాలని RRB కోరింది. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికెట్‌లోని వాటితో మ్యాచ్ అవ్వాలి. RRB గ్రూప్ D రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అర్హత ప్రమాణాలను స్పష్టంగా పేర్కొనలేదు కాబట్టి ఈసారి అర్హతలు ITI లేదా 10వ తరగతి ఉత్తీర్ణులా, 10వ తరగతి ఉత్తీర్ణులందరూ అర్హులు అవుతారా అనేది తేలాల్సి ఉంది.
Also Read : సి-డాట్లో సైంటిస్ట్ పోస్టులు
RRB గ్రూప్ D CBT ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10 తేదీలలో నిర్వహించనుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్‌లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలు ఉంటాయి.
