కేసీఆర్ పాలన స్వర్ణ యుగం: ఆర్.ఎస్.ప్రవీణ్

కేసీఆర్ పాలన స్వర్ణ యుగం: ఆర్.ఎస్.ప్రవీణ్

హైదరాబాద్: అణిచివేత కామన్.. విముక్తి  లక్ష్యం కావాలి.. గత పదేండ్లు కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం నడిచిందన్నారు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్. చితికి పోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారని అన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ వాదం.. బహు జన వాదం ఒక్కటే అన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కన్ని కాలేను అన్నారు. నేను కూడా పాలమూరు బిడ్డనే..ఓ వైపు నన్ను సీఎం పొగుడుతూనే వార్నింగ్ ఇస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాకు టీఎస్ పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన వాస్తవమే.. నేను తిరస్కరించాను.. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. 

ALSO READ :- మంథని మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్