- డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్, కండక్టర్తోపాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శుక్రవారం మెట్లకుంటకు బయల్దేరింది.
ప్రయాణికులతో డిపో గేటు నుంచి బయటకు వస్తుండగా కోడంగల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి, కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నారాయణ, కండక్టర్ యాదమ్మ, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు లారీడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
