
- భారత్‌పై అమెరికా ఒత్తిడి చట్టవిరుద్ధమన్న రష్యా
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై రష్యా సీరియస్‌గా స్పందించింది. సార్వభౌమ దేశాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య, ఆర్థిక సహకారం కోసం తమ సొంత వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కును కలిగి ఉండాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకురావడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు రష్యా చర్యలు తీసుకోకపోతే, రష్యా నుంచి చమురు కొనే దేశాలపై కొత్త ఆంక్షలు విధిస్తామని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ వైఖరిలో మార్పు లేదని తేల్చిచెప్పారు.