కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మార్కెట్ లో ఉన్న సహారా ఇండియా సంస్థ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులను కాలపరిమితి దాటిపోయి సంవత్సరాలు గడుస్తున్నా యాజమాన్యం చెల్లించడంలేదని బాధితులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డ్స్ తో ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. సహారాలో తాము ఫిక్స్ డిపాజిట్లు చేసి డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీ వంశీకృష్ణకు విజ్ఞప్తి చేశారు. సంస్థ మేనేజర్ కు వినతిపత్రం అందించారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సంజీవ్, రాజమౌళి, రామ్ నరేశ్ బాబు, మల్లేశ్వరి, రమాదేవి, లక్ష్మి, అబేదా పాల్గొన్నారు.

