Vishal Marriage: సాయి ధన్సిక ప్రాపర్ ఎక్కడ.. విశాల్, సాయి ధన్సిక పెళ్ళెక్కడ జరగనుంది?

Vishal Marriage: సాయి ధన్సిక ప్రాపర్ ఎక్కడ.. విశాల్, సాయి ధన్సిక పెళ్ళెక్కడ జరగనుంది?

తమిళ హీరో విశాల్,  హీరోయిన్‌‌ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. సోమవారం (MAY19)ఉదయం నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఇది హాట్‌‌ టాపిక్‌‌గా మారింది. సాయంత్రానికి విశాల్, సాయిధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఆమె హీరోయిన్‌‌గా నటించిన ‘యోగిదా’మూవీ ఈవెంట్‌‌కు విశాల్ అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికపైనే వీళ్లిద్దరూ పెళ్లి విషయాన్ని కన్‌‌ఫర్మ్ చేశారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని, ఆగస్టు 29న తమ వివాహం జరగబోతోందని ప్రకటించారు. ఇక విశాల్ తండ్రి జీకే రెడ్డి తెలుగు వారే కాగా తమిళనాట స్థిరపడ్డారు.

సాయి ధన్సిక నవంబర్ 20,1990న తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. గత కొన్నేళ్లుగా కోలీవుడ్‌‌లో హీరోయిన్‌‌గా కొనసాగుతోంది. ‘కబాలి’ సినిమాలో రజినీ కూతురి పాత్రలో ఆమె నటించి గుర్తింపు తెచ్చుకుంది. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి పలు తెలుగు చిత్రాల్లోనూ ఆమె నటించింది.

చెన్నైలోని నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక అందులోనే వివాహం చేసుకుంటానని గతంలో ప్రకటించాడు విశాల్. ఇటీవల అది పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే నడిగర్ సంఘం భవనంలో పెళ్లి చేసుకోబోతున్నానని, తనది ప్రేమ వివాహమని హింట్ ఇచ్చాడు విశాల్. ఇకపోతే, ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.