
ఆసియా కప్ లో పాకిస్థాన్ యువ బ్యాటర్ సైమ్ అయూబ్ తన ఫ్లాప్ షో కొనసాగిస్తున్నాడు. ఘోరంగా విఫలం అవడం చూశాం కానీ అయూబ్ మాత్రం అంతకు ముంచి అనేలా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో డకౌట్లకు కేరాఫ్ గా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్ ల్లో పరుగుల ఖాతా తెరవకుండా ఔటయ్యాడు. గురువారం (సెప్టెంబర్ 25) సూపర్-4 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మూడు బంతులాడి డకౌటయ్యాడు. మహేది హసన్ బౌలింగ్ లో మిడాన్ మీదుగా షాట్ ఆడి రిషద్ హొస్సేన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ ఆసియా కప్ లో సైమ్ అయూబ్ కు ఇది నాలుగో డకౌట్ కావడం గమనార్హం. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో డకౌట్ కావడంతో ఈ యువ బ్యాటర్ పై మాజీలు తీవ్ర విమర్శలు వస్తుంటే.. క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. టోర్నీ తొలి మ్యాచ్ లో ఒమాన్.. ఆ తర్వాత ఇండియాతో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. మూడో మ్యాచ్ లో యూఏఈతో కూడా పరుగులేమీ చేయకుండా ఔటై ఈ టోర్నీలో వరుసగా మూడో డకౌట్ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇండియాపై కష్టపడి 21 పరుగులు చేయగా.. శ్రీలంకపై రెండు పరుగులతో సరిపెట్టుకున్నాడు. ప్రస్థుహం బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా డకౌటయ్యాడు.
ఓవరాల్ గా 6 మ్యాచ్ ల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి ఈ టోర్నీలో అత్యంత చెత్త బ్యాటర్ గా నిలిచాడు. ఆయుబ్ ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో 47 మ్యాచ్ ల్లోనే 9 సార్లు డకౌటయ్యాడు. ఓవరాల్ గా పాకిస్థాన్ టీ20 చరిత్రలో అత్యధిక డకౌట్ అయిన బ్యాటర్ల లిస్ట్ లో రెండో స్థానంలో ఈ యువ బ్యాటర్ ఉన్నాడు. ఉమర్ అక్మల్: 84 మ్యాచ్‌ల్లో 10 డకౌట్లతో ఉమర్ అక్మల్ తొలి స్థానంలో ఉన్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ముందు సైమ్ అయూబ్ ఫామ్ పాకిస్థాన్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు 47 టీ 20 మ్యాచ్ లాడిన సైమ్ అయూబ్ 19.97 సగటుతో 839 పరుగులు మాత్రమే చేశాడు.
టీ20 లలో పాకిస్తాన్ తరపున అత్యధిక డకౌట్లు:
ఉమర్ అక్మల్: 84 మ్యాచ్‌ల్లో 10
సైమ్ అయూబ్: 47* మ్యాచ్‌ల్లో 9
షాహిద్ అఫ్రిది: 99 మ్యాచ్‌ల్లో 8
కమ్రాన్ అక్మల్: 58 మ్యాచ్‌ల్లో 7
మొహమ్మద్ హఫీజ్: 119 మ్యాచ్‌ల్లో 7
బాబర్ అజామ్: 128* మ్యాచ్‌లలో 7