
- పీసీసీ చీఫ్ సమక్షంలో పార్టీలో తిరిగి చేరిన సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి
ఆదిలాబాద్/ హైదరాబాద్ వెలుగు: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన నేతలకు ఆ పార్టీ అధిష్టానం మళ్లీ వెల్ కం చెప్తోంది. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డిపై సస్పెన్షన్ఎత్తివేసింది. మంగళవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు.
‘విలీనం’పై అయోమయానికి గురిచేస్తున్నరు
విలీన దినోత్సవంపై ప్రజలను బీజేపీ నేతలు అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మండిపడ్డారు. విలీన దినోత్సవాన్ని బుధవారం కూడా ఎప్పటిలాగానే గాంధీ భవన్లో ఘనంగా నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.