
- రేపటి వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్ష స్కీము కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఈ నెల 26వ తేదీలోగా రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. సమగ్ర శిక్ష పరిధిలోని కేజీబీవీ, యూఆర్ఎస్ సిబ్బంది, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు తదితరులు ఈ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ ఆఫీస్ నుంచి పంపిన రెండు నిర్దిష్ట ఫార్మాట్లలో వివరాలు సేకరించి సమర్పించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, సిబ్బంది స్పౌజ్, మ్యూచువల్ బదిలీలతో పాటు జనరల్ బదిలీలను కూడా అనుమతించాలని కోరుతున్నారు.