మెహిదీపట్నం, వెలుగు: ఇటీవల పీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా నియమితులైన సమతా సుదర్శన్ మంగళవారం రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి వివేక్ చొరవతోనే తనకు ఈ పదవి వచ్చినట్లు తెలిపారు. భీమ్ సైనిక్ రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి సత్యనారాయణ ఉన్నారు.
