ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 

ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ మంజూరైతే దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, దర్యాప్తు ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని రవి దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.