‘పాలకుర్తి’ సెగ్మెంట్ పై అధిష్టానం దృష్టి పెట్టాలి : కాంగ్రెస్ అసమ్మతి నేతలు

‘పాలకుర్తి’ సెగ్మెంట్ పై అధిష్టానం దృష్టి పెట్టాలి : కాంగ్రెస్ అసమ్మతి నేతలు
  • ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు

తొర్రూరు, వెలుగు : పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రె స్ అసమ్మతి నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ను గురువారం హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల నరేంద ర్ రెడ్డి సెగ్మెంట్ లో పార్టీ పరిస్థితులపై ఆమెకు వివరించారు. 

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నేతలను ఉద్దేశపూర్వకంగా ఝాన్సీరెడ్డి పక్కన పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని,ఆమె తీరుపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొర్రూరు మండలంలో ఏకంగా 7 మంది రెబల్ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారని, అది ఝాన్సీ రెడ్డిపై వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి సొంతూరు చర్లపాలెంలో కూడా అసమ్మతి కాంగ్రెస్ వర్గం గెలుపొందిందని వివరించారు. 

అధిష్టానం చొరవ తీసుకుని నేతల మధ్య ఐక్యత తీసుకురావాలని లేదంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూర్ మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ కూడా గెలిచే చాన్స్ ఉండదని సూచించారు.  ఇన్ చార్జ్ ను కలిసిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, మడిపల్లి, చర్లపాలెం, సోమారం సర్పంచ్ లు కె.లింగమూర్తి,  రామలింగం,  మహేందర్, నేతలు నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.