సామ్సంగ్ గేలక్సీ S25 FE ధర లీక్ : ఇండియాలో ఎంతకి కొనొచ్చంటే ?

సామ్సంగ్ గేలక్సీ S25 FE ధర లీక్ : ఇండియాలో ఎంతకి కొనొచ్చంటే ?

ఎలక్ట్రానిక్స్ & టెక్ దిగ్గజం శామ్సంగ్ కొత్త బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 FEని గత వారం పరిచయం చేసింది. కానీ ఇండియాలో దీని ధర గురించి ప్రకటించలేదు. అయితే, కొంత సమాచారం ప్రకారం దీని ధర పాత మోడల్ లాగానే ఉంటుందని చెబుతున్నారు.

 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న గెలాక్సీ S25 FE ప్రారంభ ధర రూ. 59,999గా ఉంటుందని అంచనా. ఒకవేళ ఇదే  నిజమైతే ఈ ఫోన్ మిడ్-ప్రీమియం విభాగంలో బలమైన పోటీని సృష్టించే అవకాశం ఉంది. అసలు ఈ కొత్త గెలాక్సీ S25 FE ఫోన్ ఎలా ఉంటుంది,  దీనికి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసా.... 

డిజైన్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ: గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే అందించారు. దింతో స్పష్టమైన విజువల్స్‌ అందిస్తుంది. ఎక్కువకాలం మన్నిక కోసం అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్‌తో వాటర్  ఇంకా డస్ట్ ప్రూఫ్ కూడా.. 

ALSO READ : గణేష్ మండపాల్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ 

పర్ఫార్మెన్స్ పరంగా Exynos 2400 (4nm) చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఈ పవర్ ఫుల్ చిప్‌సెట్ గేమింగ్, మల్టీ-టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ పరంగా 4,900mAh  బ్యాటరీ ఉంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 30 నిమిషాల్లో 65% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్‌కు Samsung 7 OS అప్ డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తుందట. 

 AI టెక్నాలజీ, కెమెరా ఫీచర్లు: గాలక్సీ S25 FE అసలైన ఆకర్షణ ఏంటంటే అత్యాధునిక AI టెక్నాలజీ. ఈ ఫోన్ Galaxy AI ఇంకా One UI 8తో వస్తుంది. Google భాగస్వామ్యంతో Gemini Live, Now Bar, Now Brief వంటి ఫీచర్స్ అందిస్తుంది. Gemini Live కెమెరా  ఏదైనా వస్తువును చూపిస్తే  దాని గురించి సమాచారాన్ని ఇస్తుంది, అయితే Circle to Search గేమ్ ఇండికేషన్స్ ఇవ్వడంలో సహాయపడుతుంది.

కెమెరా విభాగంలో మీరు 50MP వైడ్, 12MP అల్ట్రా-వైడ్, 8MP టెలిఫోటో లెన్స్‌తో హై-క్వాలిటీ ఫోటోలు తీయవచ్చు. జనరేటివ్ ఎడిట్,  పోర్ట్రెయిట్ స్టూడియో వంటి ఫీచర్లతో ప్రొఫెషనల్ ఎడిటింగ్‌ చేయవచ్చు. 12MP సెల్ఫీ కెమెరా తక్కువ లైట్లో కూడా గొప్ప ఫోటోలను తీయగలదు.