
- ఆపేంతవరకు చెట్టు దిగనని మొండికేసిన బాలుడు
ప్రకృతిని కాపాడాలని, జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను, మూగ జీవాలకు నిలయంగా ఉన్న చెట్లను నరకవద్దంటూ ఓ పన్నేండేండ్ల బాలుడు చెట్టెక్కి ఏడు గంటల పాటు తిండి తిప్పలు లేకుండా నిరసన తెలుపుతున్నాడు. చావడానికైనా సిద్దమే కానీ చెట్లను నరకవద్దంటూ పట్టుబట్టి చెట్టుపైనే కూర్చున్నాడు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయ నగర్లో చెట్లను నరకొద్దంటూ అనిరుధ్ అనే బాలుడు చెట్టెక్కి నిరసన తెలిపారు. కాలనీలో రోడ్డు వెడల్పు కోసం కాంట్రాక్టర్ చెట్లను నరకడానికి రావడంతో 12 ఏళ్ల వయస్సు గల బాలుడు అనిరుధ్ చెట్లను నరకొద్దంటూ అడ్డుకున్నాడు.
మనుషులకు ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు పక్షులకి ఆవాసంగా ఉన్న చెట్టును నరకవద్దంటూ చెట్టెక్కి ఏడు గంటల పాటు భోజనం కూడా చేయకుండా అనిరుద్ నిరసన తెలుపుతున్నాడు. చెట్లను నరకం అని చెబుతూ అధికారులు ఆర్డర్ కాఫీ ఇస్తేనే దిగుతానని, నేను చచ్చిపోతాను కానీ చెట్టు నరకవద్దని బాలుడు అనిరుద్ నిరసన తెలపడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.