టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ

టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ

రామచంద్రాపురం, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాట్ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపాధ్యాయులు బహిష్కరించారు. సంగారెడ్డి జిల్లా అశోక్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెయింట్ ఆర్నాల్డ్​స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం వాల్యుయేషన్​ విధులకు హాజరైన టీచర్లు మూకుమ్మడిగా బహిష్కరించి ఆందోళనకు దిగారు. వాల్యుయేషన్​ రెమ్యునరేషన్​ చార్జీలను రెట్టింపు చేయాలని, పెండింగ్​లో ఉన్న గతేడాది బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. నాలుగు రోజులుగా టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతుండగా టీచర్ల ఆందోళనతో ఆదివారం బ్రేక్​ పడింది.

సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈవోకు అందజేశారు. నిరసనలో టీపీటీఎఫ్​ జిల్లా ప్రెసిడెంట్ సోమశేఖర్​, టీఎస్​యూటీఎఫ్ జిల్లా జనరల్​ సెక్రటరీ సాయిలు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​ రాథోడ్, టీపీయూఎస్​ ప్రధాన కార్యదర్శి సుధాకర్​, జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, సయ్యద్ సాబేర్​, శ్రీనివాస్, జగన్నాథ్​, రమణ కుమార్​, విశాలి, గోపాల్, సర్ఫరాజ్​ పాల్గొన్నారు.