
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో స్కూల్ బస్సు ఎస్‌యూవీని ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు తప్పుడు మార్గంలో వచ్చి ఎస్‌యూవీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులు కారులో ఉన్నవారే కాగా.. వీరంతా గుర్గావ్‌కు వెళుతున్నట్టు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. "ఎనిమిది మందిలో ఆరుగురు మరణించారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ను ఇప్పటికే అరెస్టు చేశాం. అతనిని విచారిస్తున్నాం. ఎఫ్‌ఐఆర్‌లో కఠినమైన సెక్షన్లు అమలు చేస్తాం" అని ఘజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్
చెప్పారు.
రెండు వాహనాలు చాలా వేగంతో రావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. కారు తలుపులు కత్తిరించి మరీ మృతదేహాలను బయటకు తీసినట్టు అని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వారు తెలిపారు.