హైదరాబాద్లో ఈ పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు

హైదరాబాద్లో ఈ పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు

హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు పాఠశాలలు నాలుగు రోజులు పాటు సెలవులు ప్రకటించాయి. జూన్ 15 నుంచి జూన్ 18 వరకు చాలా ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ఇచ్చా యి. పాఠశాలలు జూన్ 19న  తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చింది.  హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ల కు కూడా బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 17 సోమవారం సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. 

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులు, ఈద్గాలకు వెళ్లి  ప్రార్థనలు చేస్తారు. పండుగకు ముందుకు ఖుర్బాని సేవల ద్వారా పేదలకు ఇంటింటికి మాంసాన్ని పంపినీ చేస్తారు. బక్రీద్ తర్వాత కొన్ని పాఠశాలలు తిరిగి బుధవారం తరగతులను ప్రారంభిస్తాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం మంగళవారమే పాఠశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయి.