సీమా హైదర్ : ఇండియా-పాక్ బార్డర్ ప్రశ్నకు విద్యార్థి క్రేజీ ఆన్సర్

సీమా హైదర్ : ఇండియా-పాక్ బార్డర్ ప్రశ్నకు విద్యార్థి క్రేజీ ఆన్సర్

సోషల్ మీడియా వచ్చినప్పట్నుంచి రోజుకు కొన్ని లక్షల వార్తలు, ఫొటోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో తాజాగా ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించిన పరీక్ష ప్రశ్నకు ఓ విద్యార్థి రాసిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలోని ఒక పాఠశాలలో, పొలిటికల్ సైన్స్ పేపర్‌లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు, దాని పొడవు గురించి ప్రశ్న వచ్చింది. భారత్ - పాకిస్తాన్ మధ్య ఏ సరిహద్దు ఉంది, దాని పొడవు చెప్పండి? అని అడిగిన ప్రశ్నకు 'సీమా హైదరర్' (సరిహద్దు) అని విద్యార్థి హాస్యభరితంగా పేర్కొన్నాడు. ఆమె ఎత్తు, 5 అడుగుల 6 అంగుళాలు అని రెండు దేశాల మధ్య సరిహద్దు దూరం అంటూ ఆన్సర్ గా రాశాడు. ఈ సమాధానానికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ కావడంతో.. యూజర్లు ఫన్నీగా కామెంట్లు చేయడం ప్రారంభించారు. వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ అని కొందరు, ఇలాంటి వినూత్న సమాధానానికి విద్యార్థికి ఎక్స్ ట్రా మార్క్ వేయాలని మరికొందరన్నారు.

పాకిస్తానీ పౌరురాలు సీమా హైదర్ తన ప్రేమికుడితో కలిసి జీవించడానికి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. 2019లో ఆన్‌లైన్ గేమ్ పబ్ జీ ఆడుతున్నప్పుడు పరిచయమైన సచిన్ మీనాతో కలిసి జీవించడానికి ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా భారతదేశానికి వచ్చింది. జూలై 4న, వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించినందుకు హైదర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు మీనాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిద్దరికీ జూలై 7న బెయిల్ లభించింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలోని ఒక ఇంట్లో తన నలుగురు పిల్లలతో కలిసి వారు సహజీవనం చేస్తున్నారు.