
- సెన్సెక్స్ 620 పాయింట్లు అప్
- 147 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడవ సెషన్‌లోనూ ర్యాలీ చేశాయి. ఆసియా మార్కెట్లలో దూకుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్లతో బుధవారం తాజా ఆల్‌టైమ్ హై లెవెల్స్‌లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 620.73 పాయింట్లు పెరిగి 78,674.25 వద్ద కొత్త ముగింపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 705.88 పాయింట్లు ర్యాలీ చేసి 78,759.40 వద్ద తాజా ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147.50 పాయింట్లు పెరిగి రికార్డు ముగింపు గరిష్ట స్థాయి 23,868.80 వద్ద స్థిరపడింది.
ఇంట్రా-డేలో ఇది 168.6 పాయింట్లు లేదా 0.71 శాతం పెరిగి తాజా జీవితకాల గరిష్ట స్థాయి 23,889.90ని తాకింది. గడిచిన మూడు రోజుల ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ.2.53 లక్షల కోట్లు పెరిగింది. 30 సెన్సెక్స్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి.
అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వెనకబడి ఉన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 0.15 శాతం ఎగబాకగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం క్షీణించింది. ఇండెక్స్‌లలో టెలికమ్యూనికేషన్ 2.30 శాతం, ఎనర్జీ 1.45 శాతం, టెక్ 0.78 శాతం, బ్యాంకెక్స్ 0.58 శాతం, సర్వీసెస్ 0.46 శాతం జంప్ చేశాయి. కమోడిటీలు, వినియోగదారుల విచక్షణ, ఐటీ, ఆటో వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.