మే 7 నుంచి 11 వరకు ఎప్ సెట్

మే 7 నుంచి 11 వరకు ఎప్ సెట్
  •      జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ 
  •     ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ 

 హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్​ ఎప్ సెట్(ఎంసెట్), టీఎస్ ఐసెట్ పరీక్షా తేదీలు మారాయి. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రీషెడ్యూల్​ను రిలీజ్ చేశారు. గత షెడ్యూల్ ప్రకారం ఎప్​ సెట్ ఎగ్జామ్స్ మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పుడు వాటిని మే 7కు మార్చారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే 7న రెండు పూటలు, 8న ఉదయం మాత్రమే ఉంటాయని లింబాద్రి  తెలిపారు. 

ఇంజినీరింగ్ పరీక్షలు 9,10 తేదీల్లో రెండు పూటలు,  11న ఉదయం మాత్రమే ఎగ్జామ్ ఉంటుందన్నారు. ఎప్ సెట్ మార్నింగ్ సెషన్​ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆఫ్టర్​నూన్ సెషన్​ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని చెప్పారు. ఐసెట్ ఎగ్జామ్ గతంలో జూన్ 4, 5 తేదీల్లో ఉండగా.. జూన్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.