- రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్, వెలుగు : మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం మోపాల్ మండలంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మహిళల శ్రేయస్సు కోసం రుణాలు మంజూరు చేస్తూ వారితో వ్యాపారాలు చేయిస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పి ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేశామన్నారు.
బీ ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే..
నిజామాబాద్ కార్పొరేషన్ అభ్యర్థులకు క్యాంపు ఆఫీస్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి బీ ఫారాలు అందజేశారు. కార్పొరేషన్లోని ఆరు డివిజన్లు రూరల్ నియోజకవర్గంలో ఉండడంతో అక్కడి నుంచే పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది.
