ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులను గెలిచి తీరుతామని ఎమ్మెల్యే మదన్మోహన్ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. నూతన బస్ స్టాండ్, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టామన్నారు. పేదలకు 300 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని, అమృత్ పథకం కింద ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జాతీయ రహదారి అభివృద్ధి చేసి పట్టణానికి మరింత శోభ తీసుకొస్తామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి లో గాంధీ చౌక్ లో లైటింగ్, రోడ్డు విస్తరణ, అంబేద్కర్ చౌరస్తాలో ఫౌంటేన్లు, ల్యాండ్‌స్కేపింగ్, ఐటీఐ సెంటర్, 100 ఎకరాల్లో అర్బన్ పార్క్ అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణం మరింత అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
