నిజామాబాద్ అర్బన్, వెలుగు : నగర అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం 34 వ డివిజన్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పని చేస్తుందని, ఒక్కసారి ఇందూరు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవతలపై ఒట్టేసి గెలిచిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక హిందూ దేవతలపై అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో 34వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బంటు ప్రీతి, బంటు ప్రవీణ్, వనిత, ముందడ పవన్ తదితరులు పాల్గొన్నారు.
