
- అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్
సిద్దిపేట రూరల్, వెలుగు: ఎన్నికల హెల్ప్ డెస్క్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల హెల్ప్ డెస్క్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తామన్నారు.
ఈ మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూసిన, భయభ్రాంతులకు గురిచేయాలని చూసిన హెల్ప్ డెస్క్ నెంబర్ 08457-230000 కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈడియం ఆనంద్, హెల్ప్ డేస్క్ సిబ్బంది తదితరులు ఉన్నారు.