నవంబర్ 22న సింగరేణిలో ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం

నవంబర్ 22న సింగరేణిలో ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై కార్మికుల సూచనలు, సలహాలు సేకరించేందుకు సంస్థ చైర్మన్ ఎన్. బలరామ్  ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు.

శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుందని సింగరేణి పబ్లిక్ రిలేషన్స్ విభాగం శుక్రవారం వెల్లడించింది.   కేటాయించిన టైమ్​లో 040-23311338 నంబర్‌‌‌‌కు కాల్ చేసి చైర్మన్‌‌‌‌తో మాట్లాడవచ్చని పేర్కొన్నారు.