ముగ్గు తొక్కిందని ఇంటి ఓనర్ పై దాడి.. జూబ్లీహిల్స్ లో ఇద్దరు మహిళలపై కేసు

ముగ్గు తొక్కిందని ఇంటి ఓనర్ పై దాడి.. జూబ్లీహిల్స్ లో ఇద్దరు మహిళలపై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: ఇంటి ముందు వేసిన ముగ్గు, మొక్కలు తొక్కిందని కిరాయికి ఉంటున్న ఇద్దరు మహిళలు ఓనర్​పై దాడికి దిగారు.  పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్​పరిధిలోని రహమత్​నగర్​లో దివ్యభారతి (33) నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో సంధ్య అనే మహిళ అద్దెకు ఉంటోంది. ఇటీవల సంధ్య తన ఇంటి గడప ముందు ముగ్గు వేసింది. 

దీనిని ఇంటి యజమాని తొక్కిందని సంధ్య ఆమె తల్లి అసభ్యపదజాలంలో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆవేశంతో తల్లీకూతుళ్లు దివ్యభారతిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.