- బ్రోచర్‌ను ఆవిష్కరించిన జూపల్లి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కానుంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు & సెమినార్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఐ) సహకారంతో ఈ సదస్సు జరపనున్నారు.
సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం సెక్రటేరియెట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ గొప్ప సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని దేశానికి చాటిచెప్పే అవకాశం వచ్చిందన్నారు. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు, పరిశోధకులు, న్యూమిస్మాటిక్స్ నిపుణులు పాల్గొననున్న ఈ రెండు రోజుల సదస్సులో నాణేల చారిత్రక, కళాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
