మేడారం భక్తులకు పర్మనెంట్ షెడ్లు

మేడారం భక్తులకు  పర్మనెంట్ షెడ్లు
  • మ్యూజియం ఆధునికీకరణ
  • కేంద్రానికి ప్రపోజల్స్ పంపిన ట్రైబల్ ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ర్ట ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. భక్తుల కోసం మేడారం సమీప గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో షెడ్డులో కనీసం 3 వేల మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. 

ఇది గిరిజన జాతర కావటంతో కేంద్ర ట్రైబల్ శాఖ (మోటా) నుంచి సైతం వసతుల కల్పనకు, శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని రాష్ర్ట గిరిజన శాఖ అధికారులు 3నెలల కింద ప్రతిపాదనలు పంపారు. షెడ్లు, మ్యూజియం, ఇతర పనుల కోసం రూ. 12.5 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ నెలాఖరులో కేంద్ర అధికారులతో సమావేశం జరగనుందని, ఈ పనులకు ఆమోదం తెలిపే చాన్స్ ఉందని భావిస్తున్నారు.