నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యం : చైర్మన్ అన్వేష్రెడ్డి

నాణ్యమైన విత్తనాలతోనే  అధిక దిగుబడి సాధ్యం :  చైర్మన్ అన్వేష్రెడ్డి
  • తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్​రెడ్డి


కడెం,వెలుగు: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమవుతుందని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్ద బెల్లాల్ రైతు వేదికలో రైతులతో సమావేశమై విత్తన సరఫరా, నాణ్యత, సీజన్ సాగు పద్ధతులు వంటి అంశాలపై చర్చించారు. 

నాణ్యమైన విత్తనాలను వాడడం ద్వారా  అధిక దిగుబడులు సాధించడంతో పాటు, రైతుల ఆదాయం పెరుగుతుందని సూచించారు. రైతులు సర్టిఫైడ్  విత్తనాలను వాడి  అధిక ఉత్పాదకతను సాధించాలని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, పొద్దుటూరి సతీశ్ రెడ్డి, తుమ్మల మల్లేశ్, వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.