- వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హిందీ మహా విద్యాలయ అటానమస్, గుర్తింపు రద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అడ్మిషన్‌ల నిమిత్తం అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందున ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తమ వివరణ వినకుండా అటామనస్ రద్దు చేయడంపై హిందీ మహావిద్యాలయ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టగా ఓయూ తరఫున న్యాయవాది ఎవరూ హాజరుకాకపోవడంతో రిజిస్ట్రార్ హాజరవ్వాలని ఆదేశించారు
