తీరు మార్చుకోకుంటే అమెరికాకు పారిపోవాల్సిందే : ఎమ్మెల్సీ బల్మూరి

తీరు మార్చుకోకుంటే అమెరికాకు పారిపోవాల్సిందే : ఎమ్మెల్సీ బల్మూరి
  • కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ తన తీరును మార్చుకోవాలని, లేకుంటే ఆయన అమెరికాకు తిరిగి పారిపోవాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. కేటీఆర్ చర్యలు ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 

శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బల్మూరి మీడియాతో మాట్లాడారు. గతంలో సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కేటీఆర్ 55 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించారని బల్మూరి ఆరోపించారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై భూ దోపిడీ ఆరోపణలు చేయడం రాజకీయ దిగజారుడుతనమేనని ఫైర్ అయ్యారు.