హైదరాబాద్ పట్నం గజగజ..పటాన్ చెరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్ పట్నం గజగజ..పటాన్ చెరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో చలి పులి పంజా విసురుతోంది. కొన్నిరోజులుగా సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గురువారం పటాన్​చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అల్వాల్ ప్రాంతాల్లో మరింత కనిష్ట స్థాయికి పడిపోయాయి. పటాన్​చెరు ప్రాంతంలో కనిష్టంగా 9 డిగ్రీలు నమోదైంది. 

ఇది సాధారణం కంటే 6.4 డిగ్రీలు తక్కువ నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే రాజేంద్రనగర్ లో కనిష్ఠంగా 11.5 డిగ్రీలు, హయత్ నగర్ లో 12.6 డిగ్రీలు, బేగంపేటలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే అత్యధికంగా 30.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉన్నాయి.