కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో కొత్త టెండర్పిలిచి తమకు ఉపాధి కల్పించాలని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. గురువారం సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పాలచెట్టు ఏరియాలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో భిక్షాటన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై కొన్నేళ్లుగా 220 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు కొత్త టెండర్ పిలవడంతో వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. సింగరేణి యాజమాన్యం, పాలకులు పట్టించుకోవడంలేదన్నారు.
