బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రాగ సప్తస్వర, పర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ‘సిరికాకొలను చిన్నది’ నృత్యరూపకం ఘనంగా ప్రదర్శించారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర శ్రీ మహా విష్ణువు దేవాలయ చరిత్ర ఆధారంగా రచయిత వేటూరి సుందర రామమూర్తి రచించిన ఈ నృత్యరూపకంలో దేవదాసి అలువేణి మహావిష్ణువునే భర్తగా భావించి ఆలయ సేవలు చేస్తుంది. అనంతరం జరిగిన సభలో విద్యావేత్త ప్రీతి రెడ్డి, హరీశ్ యార్లగడ్డ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సినీ రచయిత భారవి, డాక్టర్ సతీశ్ రెడ్డి, వేటూరి సతీమణి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
